
అమరావతి నిర్మాణానికి రూ. 27వేల కోట్లు!
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 27,097 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 27,097 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అమరావతిలో భవనాల నిర్మాణానికి రూ. 10,519 కోట్లు, మౌలిక వసతులకు రూ. 1,536 కోట్లు, రహదారుల విస్తరణకు రూ. 9,181 కోట్ల ఖర్చు అవుతుందని కేంద్రమంత్రి హెచ్‌పీ చౌదరి తెలిపారు. ఏపీ నూతన రాజధాని విషయమై ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.