నీరవ్‌ మోదీ కోసం లండన్‌కి సీబీఐ, ఈడీ | CBI-ED team to leave for UK for Nirav Modi hearing | Sakshi
Sakshi News home page

నీరవ్‌ మోదీ కోసం లండన్‌కి సీబీఐ, ఈడీ

Mar 28 2019 5:01 AM | Updated on Mar 28 2019 5:01 AM

CBI-ED team to leave for UK for Nirav Modi hearing - Sakshi

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీ బెయిల్‌ కేసు లండన్‌ కోర్టులో విచారణకు రానుండడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) బృందం లండన్‌ బయలుదేరింది. ఈడీ–సీబీఐ నుంచి జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని బుధవారం లండన్‌ బయలుదేరారు. నీరవ్‌మోదీ భార్య అమీపై ఈడీ ఇటీవల చార్జిషీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పత్రాలు కూడా తీసుకువెళ్లనున్నారు. భారతీయ అధికారులు ఆ దేశంలోని వివిధ అధికారులను, క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ను కలిసి మోదీ, అతని కుటుంబ సభ్యులు, ఇతరులపై భారత్‌లో దాఖలైన కేసులకు సంబంధించిన వివరాలు, తాజా సాక్ష్యాలు గురించి వారికి తెలియజేస్తారు. నీరవ్‌మోదీ తన బంధువు మెహుల్‌ చోక్సీతో కలిసి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుండి రుణాలు తీసుకుని ఎగవేసినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement