ప్రతిష్టాత్మక జవహార్‌లాల్ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో కుల వివక్ష తీవ్రస్థాయిలో ఉందని.. దీన్ని పరిష్కరించకపోతే
9 మంది విద్యార్థుల ఫిర్యాదు.. పరిష్కరించండి: హెచ్‌ఆర్‌డీ ఆదేశం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహార్‌లాల్ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో కుల వివక్ష తీవ్రస్థాయిలో ఉందని.. దీన్ని పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ విద్యార్థి వీసీకి లేఖ రాసిన సంగతిపై విచారణ జరుగుతుండగానే.. తమను కులం పేరుతో వేధిస్తున్నారంటూ మరో 9 మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వచ్చే ఏడాది వరకు తన పరిశోధన గ్రాంటును పెంచకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ విద్యార్థి బెదిరించాడు.
తన డిపార్ట్‌మెంట్ నుంచి పీహెచ్‌డీ ఆపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. కాగా.. ఈ తొమ్మిది మంది విద్యార్థుల కూడా తమను వేధిస్తున్నారని లేఖలు రాశారు. వీటిపై స్పందించిన మానవ వనరుల అభివృద్ధిశాఖ కూడా విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వర్సిటీ అధికారులను ఆదేశించింది. కాగా.. జేఎన్‌యూ కొత్త వీసీగా ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్, తెలుగువాడైన జగదీశ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.