పౌర నిరసనలు : ‘కావాలంటే పాకిస్తాన్‌ వెళ్లిపోండి’

CAA Protests BJP MP Says Munawwar Rana Daughter Free To Go To Pak - Sakshi

లక్నో : భారత్‌లో ఉండేందుకు ఇబ్బందులు పడుతున్న వారు పాకిస్తాన్‌ వెళ్లిపోవచ్చునని అలీఘర్‌ బీజేపీ ఎంపీ సతీశ్‌ గౌతమ్‌ అన్నారు. హిందుస్తాన్‌పై అక్కసు వెళ్లగక్కే దేశద్రోహులకు పాకిస్తాన్‌ ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని ఆయన ఎద్దేవా చేశారు. అలీఘర్‌లో జరిగిన పౌరసత్వ నిరసనల్లో పాల్గొన్న ప్రముఖ కవి మునవ్వార్‌ రాణా కూతురు సుమైయా దేశంలో పరిస్థితులు బతికేందుకు అనువుగా లేవని, ఇక్కడ ఉండలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సుమైయా వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఎంపీ పై వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛకు కొదవ లేదని, ఆ స్వేచ్ఛ అందరికీ ఉంటుందని ఎంపీ సతీశ్‌ గౌతమ్‌ తెలిపారు. అయిష్టంగా, ఇబ్బందులు పడుతూ హిందుస్తాన్‌లో ఉండాల్సిన అవసరం ఏమిటని, సుమైయా స్వేచ్ఛగా పాకిస్తాన్‌ వెళ్లిపోవచ్చునని అన్నారు.
చదవండి : 
కన్నడ బీజేపీ వివాదాస్పద ట్వీట్‌
సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలెందుకు?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top