రైల్వే మంత్రి తమ్ముడు.. ఓ స్టేషన్ మాస్టర్!! | brother of railway minister is a station master | Sakshi
Sakshi News home page

రైల్వే మంత్రి తమ్ముడు.. ఓ స్టేషన్ మాస్టర్!!

May 28 2014 6:56 PM | Updated on Sep 2 2017 7:59 AM

డీవీ సురేష్ గౌడ.. ఈయన కర్ణాటకలో ఓ రైల్వే స్టేషన్ మాస్టర్. నిన్న మొన్నటి వరకు అంతే. కానీ, ఇప్పుడు ఆయన స్వయానా రైల్వే మంత్రి సదానంద గౌడకు తమ్ముడు.

డీవీ సురేష్ గౌడ.. ఈయన కర్ణాటకలో ఓ రైల్వే స్టేషన్ మాస్టర్. నిన్న మొన్నటి వరకు అంతే. కానీ, ఇప్పుడు ఆయన స్వయానా రైల్వే మంత్రి సదానంద గౌడకు తమ్ముడు. తమ సొంత రాష్ట్రంలో, అందునా దక్షిణ కన్నడ ప్రాంతంలో రైల్వేలలో భద్రతా వ్యవస్థను తన అన్నయ్య మెరుగు పరచాలని ఆయన కోరుకుంటున్నారు. మంగళూరు సమీపంలోని నందికూర్ అనే స్టేషన్లో ఈయన పనిచేస్తున్నారు. తనకోసం అన్నయ్య ఏమీ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పుడు కూడా తన కోసం ఆయన్ను ఏమీ అడగలేదని సురేష్ గౌడ తెలిపారు. తన అన్నకు కేబినెట్ హోదా లభిస్తుందని అనుకున్నాను గానీ, ఏకంగా రైల్వేల లాంటి మంచి శాఖ వస్తుందనుకోలేదని అన్నారు. ఆర్ఆర్బీ పరీక్షలు రాసి 1985లో హుబ్లీలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా ఈయన తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement