breaking news
suresh gowda
-
Covid 19: బెడ్డు కోసం లంచమిచ్చా: మాజీ ఎమ్మెల్యే
బనశంకరి/కర్ణాటక: ప్రైవేటు ఆసుపత్రిలో తల్లికి బెడ్ ఇవ్వడానికి కుమారుని నుంచి రూ.1.20 లక్షల లంచం తీసుకున్న ఆరోగ్య మిత్ర ఉద్యోగి పునీత్, ప్రైవేటు ఆస్పత్రి ఉద్యోగులు మంజునాథ్, వెంకటసుబ్బారావ్ అనే ముగ్గురిని సదాశివనగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తి తన తల్లికి కరోనా సోకడంతో నెలమంగల పీపుల్‌ట్రీ ఆస్పత్రికి తీసుకెళ్లగా బెడ్ లేదని చెప్పారు. ఈ సమయంలో పై ముగ్గురు కలిసి డబ్బు ఇస్తే బెడ్డు ఇప్పిస్తామనడంతో రూ.1.20 లక్షలను వారికి ఇచ్చాడు. ఆ వెంటనే ఐసీయూలో చేర్పించారు. అయితే కొంతసేపటికే ఆమె చనిపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. బెడ్డు కోసం లంచమిచ్చా: మాజీ ఎమ్మెల్యే తుమకూరు: కరోనా రోగం వస్తే డబ్బులు ఉండాలి, లేకపోతే వారికి బెడ్లు, ఆక్సిజన్ దొరకవు, నా బంధువులకు వీటి కోసం ముడుపులు ఇచ్చానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేష్ గౌడ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ కరోనా పేరుతో అవినీతి తాండవిస్తోందని, డబ్బులు ఇవ్వకుంటే చికిత్స దొరకడం లేదన్నారు. బెంగళూరులో తమ బంధువుకు ఎన్ని ఆస్పత్రులు తిరిగినా బెడ్ దొరకక ఇబ్బంది పడుతుంటే నేను రూ. 20 వేలు లంచమిచ్చి బెడ్ ఇప్పించా. రాష్ట్రంలో డబ్బులు లేకపోతే ఎక్కడా వైద్యం దొరకదని ఆరోపించారు. చదవండి: తండ్రీకొడుకుపై కరోనా పగ.. రోజు వ్యవధిలో ఇద్దరూ మృతి -
రైల్వే మంత్రి తమ్ముడు.. ఓ స్టేషన్ మాస్టర్!!
డీవీ సురేష్ గౌడ.. ఈయన కర్ణాటకలో ఓ రైల్వే స్టేషన్ మాస్టర్. నిన్న మొన్నటి వరకు అంతే. కానీ, ఇప్పుడు ఆయన స్వయానా రైల్వే మంత్రి సదానంద గౌడకు తమ్ముడు. తమ సొంత రాష్ట్రంలో, అందునా దక్షిణ కన్నడ ప్రాంతంలో రైల్వేలలో భద్రతా వ్యవస్థను తన అన్నయ్య మెరుగు పరచాలని ఆయన కోరుకుంటున్నారు. మంగళూరు సమీపంలోని నందికూర్ అనే స్టేషన్లో ఈయన పనిచేస్తున్నారు. తనకోసం అన్నయ్య ఏమీ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పుడు కూడా తన కోసం ఆయన్ను ఏమీ అడగలేదని సురేష్ గౌడ తెలిపారు. తన అన్నకు కేబినెట్ హోదా లభిస్తుందని అనుకున్నాను గానీ, ఏకంగా రైల్వేల లాంటి మంచి శాఖ వస్తుందనుకోలేదని అన్నారు. ఆర్ఆర్బీ పరీక్షలు రాసి 1985లో హుబ్లీలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌గా ఈయన తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు.