బీజేపీ నాయకుడి వాహనాలకు నిప్పుపెట్టిన ఉగ్రవాదులు

BJP leader Van Among Two Vehicles Set Ablaze By Terrorists In Kulgam - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం జిల్లా బోనిగాం గ్రామంలో ఉగ్రవాదులు బీజేపీ నాయకుడికి చెందిన రెండు కార్లకు నిప్పు పెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన బీజేపీ నాయకుడు అదిల్‌ అహ్మద్‌ నివాసం బయట జరిగింది. ఆదిల్ నివాసం బయట పార్క్ చేసిన వాహనాలకు ముష్కరులు నిప్పు పెట్టిన సమయంలో ఆయన ఇంట్లో లేరని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top