ములాయంపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

BJP Leader Controversial Comments On Mulayam Singh Yadav - Sakshi

లక్నో : సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ) స్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌పై స్థానిక బీజేపీ నేత తేజేంద్ర నిర్వాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ములాయం కుటుంబం నుంచి గనుక ఎవరైనా ప్రధాన మంత్రి గనుక అయితే.. వాళ్లింట్లోని కుక్కలు కూడా ఎమ్మెల్సీలు అవుతాయని తేజేంద్ర వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ ఒకవేళ ములాయం సింగ్‌ కుటుంబానికి ప్రధాని పదవి దక్కితే.. వాళ్ల కుటుంబ సభ్యులు మొత్తం రాజ్యసభలో ప్రవేశిస్తారు. అప్పుడు ములాయం ఇంట్లోని కుక్కలు కూడా ఎమ్మెల్సీలు అవుతాయి.  ఇలా కాకుండా మాయావతికి గనుక ఆ పదవి దక్కితే వాళ్ల ఇరుగు పొరుగు వారు, బంధువులు ఎమ్మెల్సీలు అవుతారు’ అని జితేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆస్పత్రిలో చేరడం ఖాయం..
‍ప్రధాని నరేంద్ర మోదీ దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తారన్న జితేంద్ర... ‘ ప్రతిపక్షంలో ఉండి ప్రధాని పదవి చేపట్టాలని ఆశిస్తున్న ప్రతీ ఒక్క నేతకు సవాల్‌ విసురుతున్నా. ప్రతిరోజూ 18 గంటల చొప్పున ఎనిమిది రోజుల పాటు ఏకదాటిగా పనిచేస్తే.. ఆ తర్వాతి రోజు వారంతా కచ్చితంగా ఆస్పత్రి పాలవుతారు. ఇందుకు నాది గ్యారెంటీ’ అని పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top