రాజకీయంగా ఎదుర్కుకోలేకనే నకిలీ ఎన్‌కౌంటర్ కేసుతో మోదీని అప్రదిష్టపాలు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని బీజేపీ మరోసారి విమర్శించింది.
న్యూఢిల్లీ: రాజకీయంగా ఎదుర్కుకోలేకనే నకిలీ ఎన్‌కౌంటర్ కేసుతో మోదీని అప్రదిష్టపాలు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని బీజేపీ మరోసారి విమర్శించింది. ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ వివాదంలో తొలి అఫిడవిట్‌పై కూడా అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం సంతకం చేశారంటూ మీడియాలో వార్తలు రావటంతో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ఈ విమర్శలు చేశారు.
ఈ కేసులో చిదంబరంకు వ్యతిరేకంగా అన్ని సాక్షాలున్నందున ఆయన తప్పించుకోలేరని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈ ఆరోపణలకు కాంగ్రెస్ బదులిచ్చింది. బీజేపీ హయాంలో జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్లను తప్పుదోవ పట్టించేందుకే ఇషత్ ్రపేరును మళ్లీ తెరపైకి తెచ్చారని ఆరోపించింది.