'బిన్ లాడెన్' అంటే భయపడుతున్న లాలూ, పాశ్వాన్! | Bihar's 'Osama bin Laden' is now an untouchable | Sakshi
Sakshi News home page

'బిన్ లాడెన్' అంటే భయపడుతున్న లాలూ, పాశ్వాన్!

Mar 28 2014 6:09 PM | Updated on Sep 2 2017 5:18 AM

ఓట్లను రాబట్టుకునేందుకు ఏది అనుకూలంగా కనిపిస్తే దాన్ని వాడేసుకోవడం రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య.

పాట్నా: ఓట్లను రాబట్టుకునేందుకు ఏది అనుకూలంగా కనిపిస్తే దాన్ని వాడేసుకోవడం రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికల్లో ఒసామా బిన్ లాడెన్ పోలికలతో ఉన్న వ్యక్తిని వాడుకున్న బీహార్ నేతలు లాలు ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ లు ప్రస్తుతం ఆయన ముఖం చూస్తేనే దడుసుకుంటున్నారట. గతంలో ఓట్లు రాబట్టేందుకు తనను ఎన్నికల ప్రచారంలో వాడుకున్న నేతలు ఇప్పుడు తానంటనే ముఖం చాటేస్తున్నారని లాడెన్ పోలికతో ఉన్న మెరాజ్ ఖాలిద్ నూర్ అన్నారు. 
 
పాట్నాకు చెందిన నూర్ ను 2004లో లోక్ జనశక్తి పార్టీ నేత పాశ్వాన్, 2005 ఎన్నికల్లో ఆర్జేడి అధినేత లాలూ పోటిపడి ప్రచారానికి వాడేసుకున్నారు.  బీహార్ ఎన్నికల్లో  ముస్లిం ఓటర్లు కీలకంగా మారిన సమయంలో తనను వాడున్నారన్నారని, లాలూ, పాశ్వాన్ తో వేదికలపై ప్రత్యేక ఆకర్షణగా మారానని ఆయన తెలిపారు. 2005 ఎన్నికల్లో బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కూడా తనను అభినందించారని నూర్ గుర్తు చేసుకున్నారు. బీహార్ లోని 83 మిలియన్ల జనాభాలో ముస్లింలు 16 శాతం ఉన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో తాను కలిస్తే పట్టించుకోవడం లేదని, ఓ అంటరానివాడిని చూసినట్టు చూస్తున్నారని నూర్ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement