రైల్వే కంపుగొడుతోంది! | Bad smell in Train toilets rooms | Sakshi
Sakshi News home page

రైల్వే కంపుగొడుతోంది!

Aug 14 2013 3:52 AM | Updated on Oct 2 2018 8:10 PM

ఏసీ బోగీల్లో బొద్దింకలు.. కంపుగొట్టే టాయిలెట్లు.. దుర్గంధం వెదజల్లే రైల్వే స్టేషన్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే మన రైల్వే వ్యవస్థ కంపుగొడుతోందంటూ కాగ్ ఉతికిపారేసింది! రైళ్లు, రైల్వే స్టేషన్లలో పారిశుధ్యం మచ్చుకైనా కనిపించడం లేదని ఆక్షేపించింది.

న్యూఢిల్లీ: ఏసీ బోగీల్లో బొద్దింకలు.. కంపుగొట్టే టాయిలెట్లు..  దుర్గంధం వెదజల్లే రైల్వే స్టేషన్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే మన రైల్వే వ్యవస్థ కంపుగొడుతోందంటూ కాగ్ ఉతికిపారేసింది! రైళ్లు, రైల్వే స్టేషన్లలో పారిశుధ్యం మచ్చుకైనా కనిపించడం లేదని ఆక్షేపించింది. రైల్వేలో భోజనం కూడా రుచీపచీ లేకుండా ఉందని, ఆహారంలో నాణ్యత లేదని పేర్కొంది. రైల్వేలో పారిశుధ్యంతోపాటు, ఖర్చులు,, నిధుల వినియోగం తదితర అంశాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) ఒక నివేదిక రూపొందించింది. దీన్ని మంగళవారం ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించింది. రైల్వేలో ముఖ్యంగా పారిశుధ్యం లోపిస్తోందని కాగ్ నివేదికలో తెలిపింది.  చాలాచోట్ల యంత్రాల ద్వారా పారిశుధ్య చర్యలు చేపట్టడం లేదని వివరించింది. 17 రైల్వే జోన్ల పరిధిలోని 123 మేజర్ స్టేషన్లను పరిశీలించగా.. కేవలం 65 స్టేషన్లలో మాత్రమే యంత్రాల ద్వారా పారిశుధ్య పనులు చేపడుతున్నట్లు తేలిందని నివేదికలో తెలిపింది.  
 
 ముఖ్యాంశాలివీ..
  పారిశుధ్యానికి పెద్దపీట వేస్తామంటూ ప్రజా పద్దుల కమిటీకి  ప్రణాళిక ఇచ్చిన రైల్వే శాఖ.. క్షేత్రస్థాయిలో మాత్రం  చర్యలు చేపట్టలేదు.  ఎంపిక చేసుకున్న 88 రైళ్లను కాగ్ బృందాలు పరిశీలించగా.. చాలా రైళ్లలోని ఏసీ, నాన్ ఏసీ బోగీల్లో బొద్దింకలు కనిపించాయి  212 రైల్వే స్టేషన్లలో ఆహార నాణ్యతను పరిశీలించగా.. అందులో 41 స్టేషన్లలో ఁకల్తీ ఆహార పదార్థాల నిరోధక చట్టం* కింద నమూనాలను పరీక్షించలేదు. హౌరా, సెల్దా లాంటి పెద్ద స్టేషన్లలో కూడా ఆహార నాణ్యతను పరీక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు  బహిరంగంగానే మలమూత్రాలు విసర్జించడంతో స్టేషన్లు దుర్గంధం వెద జల్లుతున్నాయి  ప్రయాణికులకు అందించే దుప్పట్లలో నాణ్యత ఉండడం లేదు. చాలాచోట్ల దుప్పట్లను లాండ్రీ చేసే సదుపాయం లేదు. చెత్తడబ్బాలపై మూతలు ఉండడం లేదు. ఉన్నా నిండిపోయి చెత్త అంతా బయటకు వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement