క్యాబ్లో ప్రసవం.. శిశువు పేరు ఉబెర్! | Baby born in Uber cab, named after firm | Sakshi
Sakshi News home page

క్యాబ్లో ప్రసవం.. శిశువు పేరు ఉబెర్!

Dec 12 2015 11:48 AM | Updated on Oct 16 2018 8:42 PM

క్యాబ్లో ప్రసవం.. శిశువు పేరు ఉబెర్! - Sakshi

క్యాబ్లో ప్రసవం.. శిశువు పేరు ఉబెర్!

అది దక్షిణ ఢిల్లీలోని డెవ్లీ ప్రాంతం. పురుటి నొప్పులు పడుతున్న ఓ మహిళ అంబులెన్స్ కోసం ఎంతగానో ప్రయత్నించింది.

అది దక్షిణ ఢిల్లీలోని డెవ్లీ ప్రాంతం. పురుటి నొప్పులు పడుతున్న ఓ మహిళ అంబులెన్స్ కోసం ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఆమెకు సహాయం చేయడానికి  ఏ ఒక్క అంబులెన్స్ అందుబాటులో లేదు అనే సమాధానం వచ్చింది. దీంతో కంగారు పడిన ఆమె అటుగా వచ్చిన క్యాబ్ను పిలించింది. ఆసుపత్రికి వెళ్లే లోపే.. క్యాబ్లోనే ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె తనకు సహాయం అందించిన ఆ క్యాబ్ కంపెనీ పేరే బిడ్డకు పెట్టబోతోంది.

బాబ్లీ అనే మహిళ ప్రసవానికి సహకరించిన క్యాబ్ డ్రైవర్  షానవాజ్ మాట్లాడుతూ.. 'తాను మరో ఇద్దరు మహిళలతో ఉంది. క్యాబ్ కావాలి అని చెప్పగానే.. నేను అంబులెన్స్ను పిలువకపోయారా అని అడిగాను. అవి అందుబాటులో లేవని సమాధానం చెప్పారు. దీంతో క్యాబ్లో తీసుకెళ్తుండగానే ఆమెకు ప్రసవం అయింది. కూడా ఉన్న ఇద్దరు మహిళలు ప్రసవంలో సహకరించారు. అంతా నిమిషాల్లో జరిగిపోయింది. వెంటనే వారిని సఫ్తార్జంగ్ హస్పిటల్కు తీసుకెళ్లాను. ఎమర్జెన్సీ వార్డుకు చేర్చాను. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు.. చాలా సంతోషంగా ఉంది. ఆస్పత్రి డాక్టర్లు నువ్వు ఆమె భర్తవా అని అడిగారు' అని నవ్వుతూ తెలిపాడు.

కుటుంబ సభ్యులు ఆదివారం ఆ బిడ్డకు నామకరణ మహోత్సవం జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి షానవాజ్ను ఆహ్వనించి అతన్నే తన బిడ్డకు పేరు పెట్టాల్సిందిగా బాబ్లీ కోరింది. షానవాజ్ తను పనిచేస్తున్న సంస్థ 'ఉబెర్' పేరునే ఆ మగబిడ్డకు పెట్టనున్నట్లు వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement