
లక్నో: అనుమానిత ఐఎస్ ఉగ్రవాది అబూ జైద్‌ను ఉత్తరప్రదేశ్ ఉగ్ర వ్యతిరేక బృందం(ఏటీఎస్) అరెస్ట్ చేసింది. సౌదీ నుంచి వచ్చిన జైద్‌ను శనివారం ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్టుచేసినట్లు పోలీసులు చెప్పారు. అతన్ని ట్రాన్సిట్ రిమాండ్‌పై లక్నోకు తరలించి కోర్టులో హాజరుపరిచాక కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తారు. రియాద్‌లో నివసిస్తున్న జైద్...యువకులను ఐఎస్ వైపు ఆకర్షించేందుకు సామాజిక మాధ్యమాలలో ఓ గ్రూపును నిర్వహిస్తున్నాడు. ఏప్రిల్‌లో అరెస్టయిన కొందరు ఐఎస్ ఉగ్రవాదులను విచారించగా జైద్ పేరు బయటకొచ్చింది.