'వాజ్ పేయి, అద్వానీ శకం ముగిసింది' | Atal Bihari Vajpayee, L K Advani's era has ended in BJP: Karuna Shukla | Sakshi
Sakshi News home page

'వాజ్ పేయి, అద్వానీ శకం ముగిసింది'

Mar 16 2014 12:31 PM | Updated on Aug 15 2018 2:14 PM

'వాజ్ పేయి, అద్వానీ శకం ముగిసింది' - Sakshi

'వాజ్ పేయి, అద్వానీ శకం ముగిసింది'

బీజేపీ లో మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి, ఎల్ కే అద్వానీల శకం ముగిసిందని వాజ్ పేయి మేనకోడలు కరుణా శుక్లా అన్నారు

బీజేపీ లో మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి, ఎల్ కే అద్వానీల శకం ముగిసిందని వాజ్ పేయి మేనకోడలు కరుణా శుక్లా అన్నారు. వార్టు స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సేవ చేసిన తనను సీనియర్ నేతలు పట్టించుకోలేదని ఆరోపించారు.
 
చత్తీస్ ఘడ్ బీజేపీ శాఖ, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ లు అనేకమార్లు తనను అవమానించే విధంగా ప్రవర్తించారని ఆమె విమర్శించారు. నరేంద్రమోడీ, రాజ్ నాథ్ సింగ్ లాంటి కొందరి వ్యక్తుల చెప్పు చేతుల్లోనే బీజేపీ నడుస్తోందన్నారు. 
 
బీజేపీ అగ్ర నాయకత్వ తీరుతో మనస్తాపం చెందిన కరుణా శుక్లా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ఒకే లోకసభ స్థానాన్ని గెలుపొందిన కాంగ్రెస్ కు ఈసారి చత్తీస్ ఘడ్ లో ఎక్కువ స్థానాలు లభిస్తాయని ఆమె అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement