'వేడుకుంటున్నా.. దయచేసి సహకరించండి' | arun jaitley requests congress for GST bill | Sakshi
Sakshi News home page

'వేడుకుంటున్నా.. దయచేసి సహకరించండి'

May 5 2015 5:07 PM | Updated on Mar 18 2019 9:02 PM

'వేడుకుంటున్నా.. దయచేసి సహకరించండి' - Sakshi

'వేడుకుంటున్నా.. దయచేసి సహకరించండి'

నేను వేడుకుంటున్నా.. దయచేసి సహకరించండి'. ఇది పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ కు చేసిన అభ్యర్థన .

ఢిల్లీ: 'నేను వేడుకుంటున్నా.. దయచేసి సహకరించండి'. ఇది పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ కు చేసిన అభ్యర్థన . కీలకమైన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) బిల్లు మంగళవారం లోక్ సభకు వచ్చిన సందర్భంగా జైట్లీ ఈ మేరకు కాంగ్రెస్ కు విన్నవించారు. అప్పటివరకూ ఆ బిల్లుపై  కాస్త వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ మెత్తబడింది. దీంతో పార్లమెంట్ లో జీఎస్టీ బిల్లుకు మూడింట రెండొంతల మెజార్టీ లభించి బిల్లు ఆమోదం పొందింది.

 

ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలైతే రాష్ట్రాలు ముందడుగు వేస్తాయని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ మద్దతు తెలపడానికి కారణం ఇది తమ ప్రభుత్వ ఆలోచనేనని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement