ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా అనుపమ్‌ ఖేర్‌

Anupam Kher appointed new FTII chairman

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌(62)కు కీలక పదవి లభించింది. పుణేలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌గా ఖేర్‌ను నియమించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారులు తెలిపారు. ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా తనను ఎంపిక చేయడంపై ఖేర్‌ స్పందిస్తూ ‘ప్రతిష్టాత్మకమైన ఎఫ్‌టీఐఐకి చైర్మన్‌గా ఎంపిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నా.

నాకు అప్పగించిన విధుల్ని శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తాను’ అని ట్వీటర్‌లో అన్నారు. ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా పనిచేసిన గజేంద్ర చౌహాన్‌ పదవీకాలం ముగిసిన 7 నెలల అనంతరం కేంద్రం అనుపమ్‌ ఖేర్‌ను చైర్మన్‌గా కేంద్రం నియమించింది. ఖేర్‌ ఢిల్లీలోని నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా(ఎన్‌ఎస్‌డీ)లో డిగ్రీ పొందారు. 500 పైచిలుకు చిత్రాల్లో నటించిన ఖేర్‌ సినిమా,కళల రంగానికి అందించిన సేవలకు గానూ 2004లో పద్మశ్రీ, 2016లో పద్మవిభూషణ్‌ పురస్కారాలను అందుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top