
రూ 50 లక్షల వరద సాయం ప్రకటించిన మెగాస్టార్
ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచన్ అసోం వరద బాధితులకు రూ 50 లక్షల విరాళం ప్రకటించారు. ప్రజలంతా తమకు తోచిన సాయం చేయాలని పిలుపు ఇచ్చారు. వరదలు పోటెత్తి నష్టపోయిన అసోంకు ఊరటగా అమితాబ్ బచన్ రూ 51 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపినందుకు ధన్యవాదాలు చెబుతూ ఆ రాష్ట్ర సీఎం శర్బానంద్ సోనోవాల్ ట్వీట్ చేశారు.
అసోం ప్రజల తరపున తమకు బాసటగా నిలిచిన అమితాబ్ తమ ఔదార్యం చాటుకున్నారని అన్నారు. అసోం సీఎం శర్బానంద్ సోనోవాల్ ట్వీట్‌ను అమితాబ్ షేర్ చేస్తూ అసోం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నందున మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. మరోవైపు వరదలతో దెబ్బతిన్న కజిరంగ పార్క్ పునరుద్ధరణ కోసం అంతకుముందు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ కోటి విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.