ఇండిగో సిబ్బందిపై బాలీవుడ్‌ సింగర్‌ చిందులు

Aditya Narayan Misbehaves With Airport Staff

రాయ్‌పూర్‌ : విమానశ్రయ సిబ్బందిపై ప్రముఖుల ఆగడాలు ఆగడం లేదు. జేసీ దివాకర్‌ రెడ్డి, రవీంద్ర గైక్వాడ్‌ వంటి రాజకీయ నేతలు ఎయిర్‌పోర్డు సిబ్బందిపై విరుచుకుపడి వివాదాస్పదానికి గురికాగ, తాజాగా బాలీవుడ్‌ గాయకుడు, ప్రముఖ టెలివిజన్‌ యాంకర్‌ ఆదిత్య నారాయణ్‌ కూడా ఈ వివాదంలో చిక్కుకున్నారు. రాయ్‌పూర్‌ ఎయిర్‌పోర్టు ఇండిగో సిబ్బందిపై ఆదిత్య నారాయణ్‌ చిందులు వేశారు. నీ దుస్తులు ఊడదీస్తానంటూ సిబ్బందిని బెదిరించారు. ఈ దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డయ్యాయి. రిపబ్లిక్‌ టీవీ వీటిని ఎక్స్‌క్లూజివ్‌గా వీటిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఆదిత్య నారాయణ్‌ తీరుపై ఇండిగో సిబ్బంది అభ్యంతరం వ్యక్తంచేశారు.

నో ఫ్లై లిస్టు ప్రకారం ప్రతిఒక్క ప్రయాణికుడిని సమానంగా చూస్తామంటూ ఎయిర్‌లైన్‌ ప్యాసెంజర్‌ అసోసియేషన్‌ సుధాకర్‌ రెడ్డి చెప్పారు. ఇండిగో ఈ విషయంపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆదిత్య నారాయణ్‌ తీరుపై స్పందించిన మరో బాలీవుడ్‌ సింగర్‌ ఇలా అరుణ్‌, ఎవరూ కూడా పక్కన వాళ్లతో తప్పుగా ప్రవర్తించకూడదని, ఆదిత్య వ్యక్తిగత స్థాయి తనకు తెలుసని, ఆయన చాలా గౌరవప్రదమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఇలాంటి  ప్రవర్తనను తాను ఆమోదించనని, కానీ ఆయన ఎందుకు ఇలా చేశారు? అనేదే పెద్ద ప్రశ్నార్థకమని చెప్పారు. సింగర్‌ ఉదిత్‌ నారాయణ్‌కు ఆదిత్య నారాయణ్‌ కొడుకు. 

Back to Top