మా కూతురును సైన్యంలో చేరుస్తా | Add our daughter in the army | Sakshi
Sakshi News home page

మా కూతురును సైన్యంలో చేరుస్తా

Feb 27 2016 1:58 AM | Updated on Sep 3 2017 6:29 PM

మా కూతురును సైన్యంలో చేరుస్తా

మా కూతురును సైన్యంలో చేరుస్తా

కూతురు పెద్దయ్యాక తనను సైన్యంలో చేర్పిస్తానని అమర జవాను హనుమంతప్ప భార్య మహాదేవి తెలిపారు.

అమర జవాను హనుమంతప్ప భార్య వెల్లడి
 
 నాగ్‌పూర్: కూతురు పెద్దయ్యాక తనను సైన్యంలో చేర్పిస్తానని అమర జవాను హనుమంతప్ప భార్య మహాదేవి తెలిపారు. లాన్స్ నాయక్ హనుమంతప్ప సియాచిన్‌లో హిమపాతం కారణంగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన మంచుకింద ఆరురోజులు చిక్కుకుపోయారు. తర్వాత గుర్తించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 11న మృతిచెందారు.

కాగా, తమకు కుమారుడు లేనందుకు బాధలేదని, తమ ఏకైక కుమార్తెనే పెద్దయ్యాక భారత సైన్యం లో చేర్పిస్తానని మహాదేవి పేర్కొన్నారు. అదే హనుమంతప్పకు నిజమైన నివాళి అని అన్నారు. హనుమంతప్ప తల్లి బసమ్మ, మహాదేవిలను నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ భార్య కంచన్ హనుమంతప్ప కుటుంబానికి లక్షరూపాయల చెక్‌ను అందజేశారు. ఏబీవీపీ, యువ జాగరణ్ మంచ్‌లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement