ఆప్ ‘డిన్నర్’ రాబడి 50 లక్షలు | AAP dinner income 50 lakhs | Sakshi
Sakshi News home page

ఆప్ ‘డిన్నర్’ రాబడి 50 లక్షలు

Mar 17 2014 2:32 AM | Updated on Aug 20 2018 4:05 PM

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌తో డిన్నర్ కార్యక్రమంలో ఆ పార్టీకి భారీగానే నిధులు సమకూరాయి. నిధుల సమీకరణ కోసం శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన డిన్నర్‌లో 200 మంది పాల్గొనగా ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.20 వేలు చందాగా వసూలు చేశారు.

 బెంగళూరు: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌తో డిన్నర్ కార్యక్రమంలో ఆ పార్టీకి భారీగానే నిధులు సమకూరాయి. నిధుల సమీకరణ కోసం శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన డిన్నర్‌లో 200 మంది పాల్గొనగా ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.20 వేలు చందాగా వసూలు చేశారు.
 
  పార్టీ శ్రేయోభిలాషుల పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ ఆప్ అభ్యర్థి, ఇన్ఫోసిస్ బోర్డు సభ్యుడు వి.బాలకృష్ణన్ నేతృత్వం వహిం చారు. ఈ డిన్నర్ ద్వారా పార్టీకి రూ. 50 లక్షలు సమకూరాయని ఒక శ్రేయోభిలాషి సీఎన్ రాధాకృష్ణన్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. డిన్నర్‌కు హాజరుకాలేకపోయిన మరికొంత మంది త్వరలోనే తమ విరాళాలను పార్టీకి అందజేస్తారని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement