ఎంపీ ఫుల్లుగా తాగి పార్లమెంటులోకి..! | Aam Aadmi Party MP Bhagwant Mann comes to Parliament drunk? | Sakshi
Sakshi News home page

ఎంపీ ఫుల్లుగా తాగి పార్లమెంటులోకి..!

Jul 14 2016 8:23 AM | Updated on Apr 4 2018 7:02 PM

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. మద్యానికి ఆయన బానిస అని గతంలో పలు ఆరోపణలు రాగా.. తిరిగి అదే మద్యం విషయంపై మరోసారి వార్తల్లో నిలిచాడు.

చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. మద్యానికి ఆయన బానిస అని గతంలో పలు ఆరోపణలు రాగా.. తిరిగి అదే మద్యం విషయంపై మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఫుల్లుగా మందుకొట్టి పార్లమెంటులోకి అడుగుపెట్టారని కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత అమరిందర్ సింగ్ ఆరోపించారు.

‘భగవంత్ లాంటి వారు పంజాబ్ ఇమేజ్ కు మకిలి పట్టిస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు. కాగా, భగవంత్ పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారేం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భహిష్కరణకు గురైన యోగేంద్ర యాదవ్ కూడా ఆయన గతంలో తీవ్రంగా విమర్శించారు. లోక్ సభ సమావేశాలకు మద్యం బానిస అయిన భగవంత్ మద్యం తాగే వెళ్లే వాడని చెప్పారు.

’నేను 2014 జూలైలో ఈ విషయం తెలుసుకున్నాను. ఆ సమయంలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సమావేశం జరుగుతుంది. ఆ సమయంలో భగవంత్ నా పక్కనే కూర్చున్నాడు. గప్పున మద్యం వాసన వచ్చింది. అతడి గురించి నాకు అప్పుడే తెలిసింది’ అని యోగేంద్ర అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement