రైతులకు సాగు ఖర్చుపై 50 శాతం లాభం! | 50% profit on Expenditure of cultivation: working group | Sakshi
Sakshi News home page

రైతులకు సాగు ఖర్చుపై 50 శాతం లాభం!

Sep 29 2013 12:46 AM | Updated on Sep 1 2017 11:08 PM

పంటల సాగు ఖర్చుపై రైతులకు 50% లాభం చేకూర్చాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మో„హన్‌సింగ్‌ నియమించిన వర్కింగ్‌ గ్రూప్‌ కేంద్రానికి సిఫారసు చేసింది. హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హూడా ఈ కమిటీకి నేతృత్వం వహించారు.

చండీగఢ్‌: పంటల సాగు ఖర్చుపై రైతులకు 50% లాభం చేకూర్చాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మో„హన్‌సింగ్‌ నియమించిన వర్కింగ్‌ గ్రూప్‌ కేంద్రానికి సిఫారసు చేసింది. హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హూడా ఈ కమిటీకి నేతృత్వం వహించారు. సాగు ఖర్చుపై 50% లాభం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటే ధాన్యం, గోధుమలపై ప్రత్యేకించి బోనస్‌లు ప్రకటించాల్సిన అవసరం ఉండబోదని సిఫారసు చేశామని హూడా శనివారం చెప్పారు. తన ఇంటికి వచ్చిన రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రైతులకు స్థిరాదాయం చేకూర్చేందుకు సాగు ఖర్చుపై సగం మొత్తం వరకూ లాభం వచ్చేలా చూడాలని తమ కమిటీ సిఫారసు చేసిందన్నారు.

 

పంటల సాగుకు అయ్యే ఖర్చుకు సగ భాగాన్ని కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయించాలని అనేక ఏళ్ల క్రితమే డాక్టర్‌ స్వామినాధన్‌ కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఇన్నేళ్లూ ఈ సిఫారసులను పట్టించుకున్న పాపానపోని యూపీఏ ప్రభుత్వం రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యానే ఈ అంశంపై వర్కింగ్‌ గ్రూప్‌ను నియమించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement