సెంట్రల్ జైలు నుంచి ఖైదీల పరార్ | 5 prisoners escape from Nagpur Central Prison | Sakshi
Sakshi News home page

సెంట్రల్ జైలు నుంచి ఖైదీల పరార్

Mar 31 2015 1:34 PM | Updated on Sep 2 2017 11:38 PM

నాగ్పూర్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే నాగ్పూర్ సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. సరిగ్గా అర్థరాత్రి దాటకా 2 నుంచి 4గంటల ప్రాంతంలో వారు జైలులో నుంచి తప్పించుకున్నారు.

నాగ్పూర్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే నాగ్పూర్ సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. సరిగ్గా అర్థరాత్రి దాటకా 2 నుంచి 4గంటల ప్రాంతంలో వారు జైలులో నుంచి తప్పించుకున్నారు. వీరిలో ముగ్గురిపై ఎంసీవోసీఏ (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజడ్ క్రైం యాక్ట్) కింద కేసులు నమోదై ఉండగా మరో ఇద్దరిపై ఆయుధాల చట్టం, దొంగతనం కేసులు ఉన్నాయి. తప్పించుకుపోయిన ఖైదీల్లో ముగ్గురు మధ్యప్రదేశ్కు చెందిన బీసెన్ సింగ్, మహ్మద్ సాలెబ్ సలీం, సత్యేంద్ర గుప్తాగా గుర్తించారు.

మరో ఇద్దరు మాత్రం నేపాల్కు చెందిన ఆకాశ్ ఘోలు, ప్రేమ్ అని గుర్తించారు. మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురిపై 425 సెక్షన్(ఆయుధాల చట్టం), 392 సెక్షన్ (దొంగతనం) కింద కేసులు ఉన్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఇప్పటికే పోలీసులు వారికోసం సమీపంలోని రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, ప్రైవేట్ బస్ స్టేషన్లలో అప్రమత్తత ప్రకటించి గాలింపు చర్యలు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement