గత ఏడాది 2012లో ఆంధ్రప్రదేశ్(ఏపీ)లో వివిధ కారణాల వల్ల 2572 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్రం వెల్లడించింది.
న్యూఢిల్లీ: గత ఏడాది 2012లో ఆంధ్రప్రదేశ్(ఏపీ)లో వివిధ కారణాల వల్ల 2572 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్రం వెల్లడించింది. 2011లో ఈ సంఖ్య 2206గా ఉందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిక్ అన్వర్ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు.
రైతు ఆత్మహత్యలకు సంబంధించి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన నివేదిక సరైనదేనని మంత్రి తెలిపారు. ఏపీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రల్లో గుర్తించిన 31 జిల్లాల్లో రైతుల అభివృద్ధి, పునరావాసం కోసం రూ.19,998 కోట్ల విలువైన ప్యాకేజీలను ప్రకటించినట్టు అన్వర్ వివరించారు.