ఐపీఎల్ బెట్టింగ్ కేసులో 23 మంది అరెస్టు | 23 arrested for betting on IPL matches | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ బెట్టింగ్ కేసులో 23 మంది అరెస్టు

May 29 2014 1:07 PM | Updated on Sep 2 2017 8:02 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ ఫలితాలపై బెట్టింగ్ కాస్తున్న 23 మందిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ ఫలితాలపై బెట్టింగ్ కాస్తున్న 23 మందిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు బేగం సరాయ్ ప్రాంతంలోని ఓ ఇంటిపై దాడి చేశారు.

అక్కడ ఓ టీవీ, 20 మొబైల్ ఫోన్లు, రూ. 65 వేల నగదు, ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన చీటీలు, నగదు చెల్లింపులకు సంబంధించిన రికార్డులు అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement