20 మంది జడ్జీల నియామకం.. | 20 new judges appointed to high courts | Sakshi
Sakshi News home page

20 మంది జడ్జీల నియామకం..

Sep 29 2016 8:42 PM | Updated on Aug 31 2018 8:57 PM

20 మంది జడ్జీల నియామకం.. - Sakshi

20 మంది జడ్జీల నియామకం..

ఉన్నత న్యాయస్థానాల్లో కొత్తగా 20 మంది న్యాయమూర్తులను నియమించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

న్యూఢిల్లీః న్యాయ మంత్రిత్వ శాఖ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టింది. మొత్తం రెండు హై కోర్టుల్లో కలిసి కొత్తగా పదిహేను మంది న్యాయమూర్తులు, మరో ఐదుగురు అదనపు న్యాయమూర్తుల నియామకాలు చేపట్టినట్లు ప్రకటించింది. ఉన్నత న్యాయవ్యవస్థలో ఖాళీలు భర్తీ చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ నియామకాలను చేపట్టింది. వీరిలో మద్రాస్ హైకోర్టులో 15 మంది న్యాయమూర్తులను, ఐదుగురు అదనపు న్యాయమూర్తులను కేరళ హైకోర్లులో నియమించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ మూడు ప్రత్యేక  ప్రకటనల ద్వారా తెలిపింది.

హైకోర్టుల్లో కొత్త నియామకాల్లో భాగంగా మద్రాస్ హైకోర్టులో నియమించినవారిలో ఏఎం బషీర్ అహ్మద్, టి రవీంద్రన్, ఎస్ భాస్కరన్, పి వేల్మురుగన్, జి జయచంద్రన్, సివి.కార్తికేయన్, వి పార్తిబన్, ఆర్ సుబ్రహ్మణ్యం, ఎం గోవిందరాజ్, ఎం సుందర్, ఆర్ సురేష్ కుమార్, నిషా భాను, ఎం ఎస్ రమేష్, ఎస్ ఎం సుబ్రహ్మణ్యం, అనితా సుమంత్ లు ఉన్నారు. అలాగే కేరళ హైకోర్టులో నియమించిన ఐదుగురు అదనపు న్యాయమూర్తుల్లో సతీష్ నినన్, దేవన్ రామచంద్రన్, సోమరాజన్ పి, షిరే వి తో పాటు మొహహ్మద్ ఖాన్ బాబు ఉన్నట్లు తెలిపారు. మొత్తం 34 మంది కొత్త జడ్జీల నియామకాల్లో భాగంగా పలు ఉన్నత న్యాయస్థానాల్లో వీరిని నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement