లోయలోకి పడిన బస్సు.. 17 మంది మృతి | 17 killed, seven injured as bus plunges into gorge | Sakshi
Sakshi News home page

లోయలోకి పడిన బస్సు.. 17 మంది మృతి

May 10 2014 5:38 PM | Updated on Sep 2 2017 7:11 AM

ఉత్తరాఖండ్లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. చమోలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

గోపేశ్వర్: ఉత్తరాఖండ్లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. చమోలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రుషికేశ్ నుంచి ఘాట్కు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అర కిలో మీటరు దూరంలో లక్ష్యానికి చేరుకునే సమయంలో లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 15 మంది అక్కడిక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. లోతైన లోయలోకి పడిపోవడంతో బస్సు ముక్కులుముక్కలైంది. గాయపడిని వారికి చమోలీలో చికిత్స అందిస్తున్నారు. బాధితులందరూ గ్రామీణులే.

Advertisement
 
Advertisement
Advertisement