‘జింగాత్‌’ను ఖూనీ చేశారు; అభిమానుల ఆగ్రహం

Zingaat Ruined Say Netizens After Watching Dhadak Zingaat Song - Sakshi

ముంబై: ‘‘ఒరిజినాలిటీలో ఉన్న మహత్తే వేరు’’,.. శ్రీదేవి కూతురు జాన్వీ తెరంగేట్రం చేస్తోన్న ‘ధడక్‌’ సినిమాలో పాటను విన్నవాళ్లలో కొద్దిమంది అంటున్నమాటిది. ఇంకొందరైతే ‘‘మా ఫేవరెట్‌ పాటను ఖూనీ చేశారు.. ఈ పాపం ఊరికే పోదు..’’ అని శపిస్తున్నారు! కరణ్‌ జోహార్‌ నిర్మాణ సారథ్యంలో శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహించిన ‘ధడక్‌’ జులై 20న విడుదల కానుంది. ఇది మరాఠీ బ్లాక్‌ బస్టర్‌ ‘సైరట్‌’ కు రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. కాగా, అందరిచేతా ‘వహ్‌వా!’  అనిపించిన ‘ జింగాత్‌’ పాటను కూడా ‘ధడక్‌’లో (భాష మార్చి) యాజిటీజ్‌గా వాడేశారు. రెండు సినిమాలకు మ్యూజిక్‌ ఇచ్చింది అజయ్‌-అతుల్‌ జోడీనే!

తేడా ఏముంది?: మరాఠీలో లిరిక్స్‌ సందర్భోచితంగా సాగగా.. హిందీలో ఏమాత్రం అదోరకం పదాలు వాడినట్లు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఒరిజనల్‌లో కొరియోగ్రఫీక్‌ మూమేట్స్‌ కాకుండా వేడుకల్లో మనం చూసే డాన్స్‌లే కనిపిస్తాయి.. హిందీలో కుప్పిగంతులు వేయించారని మండిపడ్డారు. అలా బుధవారం విడుదలైన ‘ధడక్‌-జింగాత్‌’కు డిస్‌లైక్స్‌ కొడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ‘జింగాత్‌’ ఫ్యాన్స్‌. ‘‘కరణ్‌.. జింగాత్‌ పాటను పాడు చేసిన తీరు చూస్తే సినిమాను ఇంకెలా చెడగొట్టావో అర్థమవుతోంది..’’ అని ఫైరైపోయారు. అయితే, మరాఠీ వెర్షన్‌ చూడనివారు మాత్రం ఈ పాటే బాగుందని మెచ్చుకోవడం సహజమే. మీరు కూడా కిందిచ్చిన రెండు పాట(తాజా (హిందీ) జింగాత్‌ను, ఒరిజినల్‌ (మరాఠీ) జింగాత్‌)లను చూసి ఏది బాగుందో చెప్పండి....
(ధడక్‌)

 

(సైరట్‌)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top