ఈసారి బౌండ్‌ స్క్రిప్ట్‌తో వెళ్తా | Sakshi
Sakshi News home page

ఈసారి బౌండ్‌ స్క్రిప్ట్‌తో వెళ్తా

Published Tue, May 8 2018 12:33 AM

Yennai Arindhaal Sequel Is Definitely On Gautham Menon - Sakshi

అజిత్‌ హీరోగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎన్నై అరిందాల్‌’ (తెలుగులో ‘ఎంతవాడు గానీ’). ఈ సినిమాకు కచ్చితంగా సీక్వెల్‌ రూపొందిస్తానని పలు సందర్భాల్లో పేర్కొన్నారు గౌతమ్‌ మీనన్‌. ఈ సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ– ‘‘స్క్రిప్ట్‌ ఆల్రెడీ 30% కంప్లీట్‌ చేశాను. ఫుల్‌గా కంప్లీట్‌ అయ్యేవరకూ అజిత్‌ని కలవకూడదనుకుంటున్నాను. ఎందుకంటే ‘ఎన్నై అరిందాల్‌’ షూటింగ్‌ని ఫుల్‌ స్క్రిప్ట్‌తో స్టార్ట్‌ చేయలేదు. ఈసారి మాత్రం బౌండ్‌ స్క్రిప్ట్‌ రెడీ అయ్యాకే అజిత్‌ని కలుస్తాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా గౌతమ్‌ మీనన్‌ ‘ధృవ నచ్చత్రం, ధనుష్‌తో ‘ఎన్నై నోక్కి పాయుమ్‌ తోటా’ సినిమాలు రూపొందిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement