breaking news
yennai arindal
-
ఈసారి బౌండ్ స్క్రిప్ట్‌తో వెళ్తా
అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ‘ఎంతవాడు గానీ’). ఈ సినిమాకు కచ్చితంగా సీక్వెల్ రూపొందిస్తానని పలు సందర్భాల్లో పేర్కొన్నారు గౌతమ్ మీనన్. ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ– ‘‘స్క్రిప్ట్ ఆల్రెడీ 30% కంప్లీట్ చేశాను. ఫుల్‌గా కంప్లీట్ అయ్యేవరకూ అజిత్‌ని కలవకూడదనుకుంటున్నాను. ఎందుకంటే ‘ఎన్నై అరిందాల్’ షూటింగ్‌ని ఫుల్ స్క్రిప్ట్‌తో స్టార్ట్ చేయలేదు. ఈసారి మాత్రం బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయ్యాకే అజిత్‌ని కలుస్తాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ ‘ధృవ నచ్చత్రం, ధనుష్‌తో ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోటా’ సినిమాలు రూపొందిస్తున్నారు. -
'నా పనితీరు నచ్చే అజిత్ గిఫ్ట్ ఇచ్చారు'
తల నెరిసినా, తెల్లజుట్టుతోనే హీరో పాత్రలు చేస్తున్న అజిత్.. తన తాజా చిత్రం ఎన్నై అరిందాల్‌లో నటించిన పార్వతీ నాయర్‌కు మంచి గిఫ్ట్ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. ఎన్నై అరిందాల్ సినిమాలో తన పనితీరు నచ్చడంతో.. స్వతహాగా మంచి ఫొటోగ్రాఫర్ అయిన అజిత్, తన నిలువెత్తు ఫొటో తీసి బహుమతిగా ఇచ్చారని చెప్పింది. షూటింగ్ విరామంలో ఎప్పుడూ అజిత్ చేతిలో కెమెరా ఉంటుంది. తనను చాలా మంచి పోజులో ఆయన ఫొటో తీశారని, అలా తీస్తున్న విషయం కూడా అప్పుడు తనకు తెలియదని పార్వతి తెలిపింది. ఆ ఫొటోను బ్లాక్ అండ్ వైట్‌లో ప్రింట్ చేయించి, ఫ్రేమ్ కట్టించి బహుమతిగా ఇచ్చారట. తన ఇంటి గోడకు ఆ ఫొటోను తగిలించేసుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఎన్నై అరిందాల్ సినిమా గురువారం విడుదల కానుంది. ఈ సినిమాలో అరుణ్ విజయ్, అనుష్క, త్రిష ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు కమల్ హాసన్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఉత్తమవిలన్ సినిమాలో కూడా పార్వతీ నాయర్ నటించింది. అందులో ఆమెది కీలకపాత్ర అంటున్నారు.