​కన్నుల్లో కొలిమై రగిలే..

yatra movie full song lyrics released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా దిగ్గజ నేతపై రూపొందుతున్న బయోపిక్‌ ‘యాత్ర’  యూనిట్‌ సమరశంఖం అంటూ సాగే పూర్తి సాంగ్‌ లిరిక్స్‌ను లాంఛ్‌ చేసింది. వేలాది మంది వెంటరాగా మహానేత పాదయాత్రగా ప్రజాక్షేత్రంలోకి వడివడిగా వెళుతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

‘నీ కన్నుల్లో కొలిమై రగిలే..కలేదో నిజమై తెలవారెనే.. వెతికే వెలుగే రానీ.ఈనాటి సుప్రభాత గీతమే..నీకిదే అన్నది స్వాగతం’ అంటూ సాగే ఈ పాట ఆనాటి చారిత్రాత్మక యాత్రను కళ్లకుకట్టేలా ఉంది. మళయాళ మెగాస్టార్‌ మమ్ముటీ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ  చిత్రం ఆనందోబ్రహ్మ ఫేమ్‌ మహి వీ రాఘవ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ లిరికల్‌ వీడియో నెటిజన్లలో వైరల్‌ అవుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top