అపార్ట్‌మెంట్స్‌లో ఏం జరిగింది? | What happened in apartments? | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్స్‌లో ఏం జరిగింది?

Jul 5 2016 10:46 PM | Updated on Sep 4 2017 4:11 AM

అపార్ట్‌మెంట్స్‌లో ఏం జరిగింది?

అపార్ట్‌మెంట్స్‌లో ఏం జరిగింది?

బి.జయ దర్శకత్వంలో ఆర్.జె.సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘వైశాఖం’. హరీశ్, అవంతిక జంటగా నటిస్తున్నారు.

బి.జయ దర్శకత్వంలో ఆర్.జె.సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘వైశాఖం’. హరీశ్, అవంతిక జంటగా నటిస్తున్నారు. విశాఖలో ప్రారంభమైన ఈ చిత్రం నాలుగో షెడ్యూల్ 20వ తేదీ వరకూ జరుగుతుంది. బి.జయ మాట్లాడుతూ - ‘‘సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. అపార్ట్‌మెంట్స్ నేపథ్యంలో వినోదం, భావోద్వేగాలు మేళవించిన కమర్షియల్ కథ. కజక్‌స్థాన్‌లో తీసిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. బీఏ రాజు మాట్లాడు తూ - ‘‘జయ దర్శకత్వం వహించిన గత చిత్రాలు విజయం సాధించ డంతో పాటు బయ్యర్లకు లాభాల్ని అందించా యి.


దాంతో ఈ చిత్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్‌లోనూ బిజినెస్ పరంగా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఆగస్టులో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు. ప్రత్యేక పాత్రలో సాయికుమార్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: వాలిశెట్టి వెంకట సుబ్బారావు, సంగీతం: డీజే వసంత్.

 

 

Advertisement
 
Advertisement
Advertisement