కొత్తదనానికి మంచికాలం : నరేశ్ | VMKMM releasing on Nov 28th | Sakshi
Sakshi News home page

కొత్తదనానికి మంచికాలం : నరేశ్

Nov 4 2014 11:13 PM | Updated on Sep 2 2017 3:51 PM

కొత్తదనానికి మంచికాలం : నరేశ్

కొత్తదనానికి మంచికాలం : నరేశ్

సినిమాలో పంచ్ డైలాగులు ఉండడం కాదు... సినిమాలో పంచ్ ఉండటం ముఖ్యం. అలాంటి సినిమాలనే జనం ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల ఆలోచనా సరళిలో మార్పొచ్చింది.

 ‘‘సినిమాలో పంచ్ డైలాగులు ఉండడం కాదు... సినిమాలో పంచ్ ఉండటం ముఖ్యం. అలాంటి సినిమాలనే జనం ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల ఆలోచనా సరళిలో మార్పొచ్చింది. హాస్యం, భావోద్వేగాలు... ఏదైనా సరే కొత్తగా ఉంటేనే చూస్తున్నారు. కొత్తదనానికి ఇప్పుడు మంచికాలం. అలాంటి సినిమాలే విజయాలందుకుంటున్నాయి. ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా’ ఆ కోవకు చెందిన సినిమానే’’ అని నటుడు సీనియర్ నరేశ్ అన్నారు. ఆయన, రాధికా శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రధారులుగా, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం’ సుధాకర్, జీఎస్ కార్తీక్, అవంతికా మోహన్, నీతూ చౌదరి ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా’.
 
 అరుణ్ దాస్యం దర్శకుడు. రవిరాష్ దాస్యం నిర్మాత. హైదరాబాద్‌లో నరేశ్ పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తారతమ్యం ప్రేక్షకుల్లో ఉండదు. దానికి నా ‘చిత్రం భళారే విచిత్రం’ ఓ ఉదాహరణ. ‘గ్యాంగ్‌లీడర్’ లాంటి సినిమాతో పోటీగా విడుదలై, నాలుగు కోట్లు వసూలు చేసింది. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ కూడా అలాంటి ఓ మంచి ప్రయత్నం’’ అన్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో నాగరాజు పాత్రను మించే స్థాయిలో ఇందులో చేసిన జాజ్ రాజ్ పాత్ర ఉంటుందని సుధాకర్ చెప్పారు. దర్శకునిగా తన తొలి ప్రయత్నం తప్పకుండా సఫలం అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నెల 28న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement