సరికొత్తగా 'దూసుకెళ్తా' | Vishnu casts in 'Doosukeltha' | Sakshi
Sakshi News home page

సరికొత్తగా 'దూసుకెళ్తా'

Sep 18 2013 12:49 AM | Updated on Aug 28 2018 4:30 PM

సరికొత్తగా 'దూసుకెళ్తా' - Sakshi

సరికొత్తగా 'దూసుకెళ్తా'

‘దేనికైనా రెడీ’ విజయం తర్వాత మంచు విష్ణు తన కెరీర్‌ని ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. తన శారీరక భాషకు నప్పే విధంగా యాక్షన్ ఎంటర్‌టైనర్లు చేయాలని విష్ణు నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తోంది.

 ‘దేనికైనా రెడీ’ విజయం తర్వాత మంచు విష్ణు తన కెరీర్‌ని ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. తన శారీరక భాషకు నప్పే విధంగా యాక్షన్ ఎంటర్‌టైనర్లు చేయాలని విష్ణు నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ‘దూసుకెళ్తా’ సినిమా చేస్తున్నారు.
 
 పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ‘బిందాస్’, ‘రగడ’ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల ‘దూసుకెళ్తా’లో విష్ణుని సరికొత్త రీతిలో ఆవిష్కరిస్తున్నారు. ‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్య త్రిపాఠి ఇందులో కథానాయిక. 
 
 ఆరియానా-వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా.మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉంది. టైమ్స్ మ్యూజిక్ ఆధ్వర్యంలో ఈ నెలాఖరున పాటలు విడుదల కానున్నాయి. మణిశర్మ స్వరాలందించారు. అక్టోబర్ రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement