బహుమతుల వర్షం

Vishal and Lingusamy Gifts Gold Coins - Sakshi

‘పందెం కోడి 2’ టీమ్‌పై బహుమతుల వర్షం కురుస్తోందట. రీసెంట్‌గా హీరోయిన్‌ కీర్తీ సురేశ్‌ ఈ సినిమా టీమ్‌కి గోల్డ్‌ కాయిన్స్‌ పంచిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో విశాల్, దర్శకుడు లింగుస్వామి కూడా టీమ్‌ మెంబర్స్‌కు గోల్డ్‌ కాయిన్స్‌ పంచిపెట్టారట. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, కీర్తీ సురేశ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సండైకోళి 2’ (పందెం కోడి 2). సూపర్‌ హిట్‌ చిత్రం ‘సండైకోళి’కి సీక్వెల్‌ ఇది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. వర్క్‌ చేసిన టీమ్‌ అందరికీ (సుమారు 150) ఈ సినిమా గుర్తుగా విశాల్, లింగుస్వామి విడి విడిగా గోల్డ్‌ కాయిన్స్‌ అందజేశారట. అంతకుముందు కీర్తీ సురేశ్‌ ఇచ్చారు. దీంతో బహుమతుల వర్షం కురుస్తోందని చిత్రబృందం ఆనందంగా చెప్పుకుంటున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top