ఆ వార్తల్లో నిజం లేదు

Vikram Vedha filmmakers rubbish rumours of Telugu remake - Sakshi

తమిళంలో ‘విక్రమ్‌వేదా’ (2017) చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. మాధవన్, విజయ్‌ సేతుపతి హీరోలుగా నటించిన ఈ చిత్రానికి పుష్కర్‌ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించారు. వైనాట్‌ స్టూడియో ప్రతినిధి శశికాంత్‌ నిర్మించారు. ‘విక్రమ్‌వేదా’ చిత్రానికి బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ కూడా వచ్చాయి. దీంతో ఈ చిత్రం ఇతర భాషల్లో రీమేక్‌ కానుందని వార్తలు వచ్చాయి.

ఇటీవల ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ, రాజశేఖర్‌ నటించబోతున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై వైనాట్‌ స్టూడియోస్‌ ప్రతినిధులు తమ సంస్థ ట్వీటర్‌ అకౌంట్‌ ద్వారా వివరణ ఇచ్చారు. ‘‘విక్రమ్‌వేదా’ తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ, రాజశేఖర్‌ నటించబోతున్నారన్న వార్తల్లో నిజం లేదు. అవి పుకార్లు మాత్రమే. ఈ సినిమా తెలుగు రీమేక్‌ హక్కులు ఇంకా మా వద్దే ఉన్నాయి. మేం అధికారిక ప్రకటన ఇచ్చేంతవరకు ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరుతున్నాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top