విజయ్‌ వర్సెస్‌ అరుణ్‌విజయ్‌ | Vijay Vs Arun Vijay | Sakshi
Sakshi News home page

విజయ్‌ వర్సెస్‌ అరుణ్‌విజయ్‌

Dec 18 2016 1:12 AM | Updated on Sep 4 2017 10:58 PM

విజయ్‌ వర్సెస్‌ అరుణ్‌విజయ్‌

విజయ్‌ వర్సెస్‌ అరుణ్‌విజయ్‌

చిత్ర విచిత్రాలు జరగడం సినీప్రపంచంలో షరా మామూలే. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి రేస్‌లో ఏఏ తమిళ చిత్రాలు ఢీకొనబోతున్నాయన్నది ఇప్పుడు చెప్పలేని పరిస్థితి.

చిత్ర విచిత్రాలు జరగడం సినీప్రపంచంలో షరా మామూలే. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి రేస్‌లో ఏఏ తమిళ చిత్రాలు ఢీకొనబోతున్నాయన్నది ఇప్పుడు  చెప్పలేని పరిస్థితి. దీపావళి పండగకే తెరపైకి రావలసిన విశాల్‌ కత్తిసండై వాయిదా పడి సంక్రాంతికి విడుదల కానుందని ప్రకటించారు. అలాంటిది అనూహ్యంగా మూడు వారాల ముందుగానే క్రిస్మస్‌ సందర్భంగా ఈ నెల 23న తెరపైకి దూసుకొస్తోంది. ఇక ఈ నెల 16న విడుదల కావలసిన సూర్య ఎస్‌–3 చిత్రం 23కు వాయిదా పడినట్లు చిత్ర వర్గాలు వెల్ల డించాయి. అయితే ఇప్పుడు ఈ తేదీకీ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సంక్రాంతి తరువాతేననే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.

అయితే ఇళయదళపతి విజయ్‌ నటిస్తున్న ఆయన 60వ చిత్రం భైరవా మాత్రం ముందుగా ప్రకటించిన విధంగా సంక్రాంతి సందర్భంగా తెరపైకి రానుంది. దీనికి పోటీగా అనూహ్యంగా అరుణ్‌విజయ్‌ హీరోగా నటించిన కుట్రమ్‌ 23 చిత్రం తెరపైకి రానుంది. ఈ చిత్రం వర్గాలు అధికారికంగా శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.

అరుణ్‌ విజయ్‌కి జంటగా మహిమా నంబియార్‌ నటించిన ఈ చిత్రానికి అరివళగన్ దర్శకుడు. రెదర్‌ ది సినిమా పీపుల్‌ పతాకంపై ఇందర్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి విశాల్‌చంద్రశేఖర్‌ సంగీతాన్ని, కేఎం.భాస్కరన్ ఛాయాగ్రహణం, భువనశ్రీనివాస్‌ ఎడిటింగ్‌ బాధ్యతలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఇంద్రకుమార్‌ తెలుపుతూ ఇది మెడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం అని తెలిపారు. ఒక మంచి సందర్భంలో కుట్రం 23 చిత్రాన్ని విడుదల చేయనుండడం సంతోషంగా ఉందన్నారు.ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా డబుల్‌ సంతోషాన్నిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement