ఫోర్బ్స్‌ జాబితాలో విజయ్‌ దేవరకొండ

Vijay Devarakonda Gets Place In Forbes India Celebrity List - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌ లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ. తరువాత కూడా గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో అదే జోరు కంటిన్యూ చేస్తున్న విజయ్‌ తాజాగా ఫోర్బ్స్‌ జాబితాలోనూ చోటు సంపాదించుకున్నాడు. 2018లో అత్యధిక ఆదాయాన్ని పొందిన సెలబ్రిటీల లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది ఫోర్బ్స్‌.

ఈ లిస్ట్‌లో 14 కోట్ల ఆదాయంతో 72 వ స్థానంలో నిలిచాడు విజయ్‌ దేవరకొండ. ఇంత తక్కువ కాలంలో ఫోర్బ్స్‌జాబితాలో స్థానం సంపాదించడం కూడా ఓ రికార్డ్‌గానే చెపుతున్నారు ఫ్యాన్స్‌. ఈ లిస్ట్ సౌత్‌ నుంచి అగ్రస్థానంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నిలవగా పవన్‌ కల్యాణ్‌, విజయ్‌, ఎన్టీఆర్‌, విక్రమ్‌, మహేష్‌ బాబు, సూర్య, విజయ్‌ సేతుపలి లాంటి తారలు ఉన్నారు.

ఈ లిస్ట్‌లో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారకు కూడా చోటు దక్కటం విశేషం. బాలీవుడ్ కం‍డల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ 253.25 కోట్ల ఆదాయంతో తొలిస్థానంలో నిలవగా విరాట్‌ కోహ్లీ 228.09 కోట్లతో తరువాతి స్థానంలో నిలిచాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top