మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌ | Vidya Balan Thanks Local Sweeper Who Working During Lockdown | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికులను ప్రశంసించిన బాలీవుడ్‌ నటి

Apr 4 2020 9:55 AM | Updated on Apr 4 2020 10:38 AM

Vidya Balan Thanks Local Sweeper Who Working During Lockdown - Sakshi

ముంబై : కరోనాను అంతం చేసేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా.. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారీ వ్యాప్తిని నిరోధించడానికి దేశంలో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇళ్లలోనే కుటుంబంతో గడుపుతుంటే కేవలం అత్యవసర సేవల్లో పనిచేసే వారు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారు. కరోనా తమల్ని కాటేస్తుందని తెలిసినా.. వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, బ్యాంకు అధికారులు నిరంతరంగా పనిని కొనసాగిస్తున్నారు. ఈ జాబితాలోపారిశుద్ధ్య కార్మికులు కూడా ఉన్నారు. (ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో )

తాజాగా వీరి సేవలను బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ అభినందించారు. ముంబైలో ఓ మహిళ పారిశుద్ధ్య కార్మికురాలు రోడ్డుపై ఉన్న చెత్తను తొలగిస్తున్నారు. తన బాల్యనీ నుంచి ఆమెను చూసిన విద్యా.. ‘మేడమ్‌ థాంక్యూ.. గాడ్‌ బ్లెస్‌ యూ’ అంటూ మహిళకు వినపడేలా అరిచారు. అంతేగాకుండా ఆమె పనిచేస్తుండగా ఫోటో తీసి దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘కరోనా భయం ఉన్నా.. మరో పక్క తమ విధులను నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిమ్మల్నీ, మీ కుంటుంబాన్ని ఆ దేవుడు ఎల్లప్పుడు ఆశీర్వదిస్తాడు.’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవ్వడంతో విద్యా చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అలాగే మరో వీడియోలో విద్యాబాలన్ తన ఫాలోవర్స్‌కు ఇంటి పనులను కుటుంబ సభ్యులందరూ పంచుకోవాలని కోరారు, తద్వారా పని భారమంతా ఒక వ్యక్తిపై పడకుండా ఉంటుందని సూచించారు. (ఆడపులిలా బాలీవుడ్‌ భామ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement