హీరో ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం | Varun Dhawan's car damaged in crash, nobody injured | Sakshi
Sakshi News home page

హీరో ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

Oct 9 2016 6:30 PM | Updated on Apr 3 2019 6:34 PM

హీరో ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం - Sakshi

హీరో ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

ముంబై: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఆదివారం ముంబైలోనే జుహు పదో నెంబర్ రోడ్డులో వరుణ్‌ ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుణ్ కారు దెబ్బతింది. కాగా ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాద దృశ్యాన్ని చూసిన ఓ వ్యక్తి ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వరుణ్‌ కారు హోండా సిటీని ఢీకొట్టిందని ట్వీట్ చేశాడు. దీనిపై గందరగోళం ఏర్పడకుండా ఉండేందుకు వరుణ్‌ వివరణ ఇచ్చాడు. ఎవరూ గాయపడలేదని, అందరూ క్షేమంగా ఉన్నారంటూ ట్వీట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement