ఫ్యాన్స్ అసభ్యకర కామెంట్స్.. హీరో ఆందోళన! | Respect each other and my fans are abusing other actors fans, says Varun dhawan | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్ అసభ్యకర కామెంట్స్.. హీరో ఆందోళన!

Jun 30 2016 11:24 PM | Updated on Apr 3 2019 6:34 PM

ఫ్యాన్స్ అసభ్యకర కామెంట్స్.. హీరో ఆందోళన! - Sakshi

ఫ్యాన్స్ అసభ్యకర కామెంట్స్.. హీరో ఆందోళన!

ఫ్యాన్స్ అత్యుత్సాహం స్టార్ హీరోలకు మాత్రమే కాదు.. యంగ్ హీరోలకు కూడా సమస్యగా మారుతుంది.

ఫ్యాన్స్ అత్యుత్సాహం స్టార్ హీరోలకు మాత్రమే కాదు.. యంగ్ హీరోలకు కూడా సమస్యగా మారుతుంది. ఒకరి అభిమానిని అంటూ చెప్పుకుని మరో హీరో, హీరోయిన్ పై కామెంట్లు, తిట్ల పర్వం మొదలెడుతున్నారు. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. గతంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పలుమార్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ముఖ్యంగా చెప్పాలంటే.. సల్మాన్ ఖాన్ పై, ఆయన ఫ్యాన్స్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దని, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టవద్దని ఫ్యాన్స్ కు సూచించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యంగ్ హీరో వరుణ్ ధావన్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

'ఏబీసీడీ' మూవీతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న వరుణ్, తాజగా 'డిష్యూం' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అభిమానులు ఇతర స్టార్లను, వారి అభిమానులను దూషిస్తూ కామెంట్లు చేస్తున్నారని, పోస్టులు పెడుతున్నారన్న విషం తన దృష్టికి వచ్చిందని ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఇది తనను చాలా నిరాశకు గురిచేస్తుందన్నాడు. ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలని ట్వీట్ చేశాడు. ఇతర హీరోల అభిమానులు మనల్ని గౌరవించకున్నా పరవాలేదని, దాంతో మనకు కలిగే నష్టమేంలేదని కేవలం పనితోనే వారికి సమాధానం చెప్పాలని వారిలో ఉత్సాహాన్ని పెంచేలా కామెంట్ చేశాడు. అభిమానులు ఈ వార్ కు ఫుల్ స్టాఫ్ పెట్టాలని, తన గురించి ఆందోళన చెందవద్దని ఫ్యాన్స్ ను ఉద్దేశించి వరుణ్ ధావన్ పోస్ట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement