అభిమానులను హెచ్చరించిన పోర్న్ స్టార్ | So happy there's a block button, says sunny leone | Sakshi
Sakshi News home page

అభిమానులను హెచ్చరించిన పోర్న్ స్టార్

Dec 22 2015 6:47 PM | Updated on Apr 3 2019 6:23 PM

అభిమానులను హెచ్చరించిన పోర్న్ స్టార్ - Sakshi

అభిమానులను హెచ్చరించిన పోర్న్ స్టార్

ఏదైనా విషయాన్ని పోస్ట్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి పోస్ట్ చేయండి అని అభిమానులను, ట్విట్టర్ ఫాలోయర్స్ను హెచ్చరిస్తోంది పోర్న్ స్టార్, బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్.

ముంబై: ఏదైనా విషయాన్ని పోస్ట్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి పోస్ట్ చేయండి అని అభిమానులను, ట్విట్టర్ ఫాలోయర్స్ను హెచ్చరిస్తోంది పోర్న్ స్టార్, బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్. అశ్లీల అంశాలను, అసభ్యకరమైన సమాచారాన్ని పోస్ట్ చేసేవారికి  ట్వీట్ ద్వారా కొన్ని విషయాలు సూచించింది. తక్కువ కాలంలోనే బాలీవుడ్ సెలబ్రిటీలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, అభిమానులను సంపాదించుకుంది ఇండో-కెనడియన్ అయిన సన్నీ. ట్విట్టర్ ఖాతాలో బ్లాక్ ఆప్షన్ ఉండటం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఎందుకంటే ఎవరైనా అభ్యంతరకర ఫొటోలు, సమాచారాన్ని పోస్ట్ చేసినట్లు కనిపిస్తే అలాంటి వాళ్లను తన ఖాతాలో బ్లాక్ చేస్తానంటోంది.

బ్లాక్ ఆప్షన్ ని ఆయుధంగా చేసుకుని అలాంటి వారికి బుద్దిచెప్పాలని పిలుపునిచ్చింది. సెలబ్రిటీలలో బహుశా తనదే అందరికంటే ఎక్కువ బ్లాక్ లిస్ట్ ఉన్న ఖాతా అయి ఉంటుందని చెప్పింది. అయితే, అభిమానులను, ఫాలోయర్స్ను సెలబ్రిటీలు హెచ్చిరించడం ఇదే తొలిసారి కాదు. సంఘ విద్రోహకర అంశాలు, అసభ్యతతో కూడిన విషయాలను ఎవరైనా పోస్ట్ చేస్తే బ్లాక్ చేయాలని గతంలో వెటరన్ యాక్టర్ రిషి కపూర్ కూడా వ్యాఖ్యానించిన విషయం అందరికీ విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement