హాస్యనటుడు బ్రహ్మానందంకు హార్ట్‌ సర్జరీ! | Top Comedian Brahmanandam Undergoes Heart Surgery | Sakshi
Sakshi News home page

Jan 16 2019 10:10 AM | Updated on Jan 16 2019 3:42 PM

Top Comedian Brahmanandam Undergoes Heart Surgery - Sakshi

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు ముంబైలోని ఓ ఆసుపత్రిలో హార్ట్‌ సర్జరీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. గత ఆదివారం అనారోగ్యంతో ముంబైలోని ఏషియన్ హర్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన ఆయనకు సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారు. డాక్టర్‌ రమాకాంత్ పాండా ఆధ్వర్యంలో సోమవారం ఆయనకు సర్జరీ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉంది.

ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు సోషల్‌ మీడియాలో ట్వీట్లు, కామెంట్‌లు చేస్తున్నారు. ఆయన కుమారులు గౌతమ్‌, సిద్ధార్థ్‌లతో పాటు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి హాస్యలోకపు రారాజుగా వెలుగొందిన బ్రహ్మానందంకు ఇటీవల సినిమాలు తగ్గాయి.

Advertisement
 
Advertisement
Advertisement