క్రిస్మస్ కానుకగా... | Tolikiranam movie release on december 23rd | Sakshi
Sakshi News home page

క్రిస్మస్ కానుకగా...

Nov 9 2016 10:54 PM | Updated on Sep 4 2017 7:39 PM

క్రిస్మస్ కానుకగా...

క్రిస్మస్ కానుకగా...

యేసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తొలి కిరణం’.

యేసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తొలి కిరణం’. ప్రభువు పాత్రలో పీడీ రాజు నటించారు. జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ వచ్చిన యేసుక్రీస్తు చిత్రాల్లో ఎవరూ చూపించని అంశాలనూ, కోణాలనూ ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం. కీలక సన్నివేశాలను జీసస్ పుట్టిన ఇజ్రాయిల్‌లోని జెరూస లెమ్‌తో పాటు ఈజిప్టు దేశాల్లో చిత్రీకరించాం.

ఆర్‌పీ పట్నాయక్‌గారు మంచి పాటలి చ్చారు. క్రైస్తవ సమాజంతో పాటు ఇతర వర్గాల వారి నుంచి కూడా మా చిత్రానికి ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కథ మేము అనుకున్నదానికంటే బాగా వచ్చింది. ఆర్పీ సంగీతం హైలైట్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా పాటలు రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement