సోడాల్రాజు

Tholu Bommalata Movie First Look release - Sakshi

రాజేంద్రప్రసాద్, విశ్వంత్, ‘వెన్నెల’ కిశోర్, హర్షిత ముఖ్యతారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. విశ్వనాథ్‌ మాగంటి దర్శకత్వంలో దుర్గా ప్రసాద్‌ మాగంటి నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. శుక్రవారం రాజేంద్రప్రసాద్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన లుక్‌ను విడుదల చేశారు. ‘‘మా కథకు ప్రధానంగా నిలిచే సోమరాజు పాత్రలో రాజేంద్రప్రసాద్‌ నటించారు. సినిమాలో సోమరాజుకు గోలీ సోడాలంటే ఇష్టం. కాబట్టి అందరూ ఆయన్ని సోడాల్రాజు అని పిలుస్తారు.

కుటుంబంలోని సమస్యను ఓ తండ్రి స్థానంలో రాజేంద్రప్రసాద్‌ ఎలా పరిష్కరించానేది కథ’’ అన్నారు విశ్వనాథ్‌. ‘‘జీవితమంటేనే ఒక తోలుబొమ్మలాట. ఎవరి ఆట వారు ఆడాల్సిందే. కాకపోతే కొన్నిసార్లు ఆ ఆటలో చిక్కుముడులు ఉంటాయి. ఆ చిక్కుముడులను రాజేంద్రప్రసాద్‌ ఎలా విప్పారనేదే  ముఖ్య కథాంశం. ఇదొక విభిన్న కుటుంబ కథా చిత్రం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి’’ అన్నారు దుర్గా ప్రసాద్‌. ఈ సినిమాకు సురేష్‌ బొబ్బిలి సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top