ఇంతకు ముందు మలయూర్ మంబట్టియాన్, శివలపేరి పాండి వంటి యథార్థ కథా చిత్రాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే
ఇంతకు ముందు మలయూర్ మంబట్టియాన్, శివలపేరి పాండి వంటి యథార్థ కథా చిత్రాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే విధంగా 1940లో తమిళ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న వీర్ ముత్తు అనే వ్యక్తి ఇతి వృత్తంగా రూపొందస్తున్న చిత్రం వీరన్ ముత్తురాకు అని ఆ చిత్ర దర్శకుడు రాజశేఖర్ తెలిపారు.
దర్శకుడు ఎస్.ఎ.చంద్రశేఖర్ నిర్మించిన వెలుతుకట్టు చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన కధిర్ వీరన్‌ముత్తు పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో లియాశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, తమిళనాడు, శివగంగ జిల్లాలలోని ఆవరనకాడు గ్రామంలో రాబిన్‌హుడ్ లాంటి యువకుడు వీరన్‌ముత్తు అని తెలిపారు. ఈయన ఇతివృత్తాన్ని చిన్నతనంలో తన తల్లి చాలా సార్లు చెప్పేవారన్నారు.
దాన్ని తానిప్పుడు కొన్ని కమర్షియల్ అంశాలను జోడించి వీరన్‌ముత్తురాకు పేరుతో చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ యథార్థ కథకు కొంచెం రొమాంటిక్ సన్నివేశాలను జోడించినట్లు చెప్పారు. ఈ చిత్రం తన సినీ కెరీర్‌కు పెద్ద బ్రేక్ ఇస్తుందనే విశ్వాసాన్ని నటుడు కధిర్ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏమవుతుందో వేచిచూద్దాం!