కేసీఆర్ బయోపిక్ రెడీ అవుతోంది | telangana CM Kcr biopic Confirmed | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్పై త్వరలో సినిమా

Oct 20 2016 12:54 PM | Updated on Aug 15 2018 9:35 PM

కేసీఆర్ బయోపిక్ రెడీ అవుతోంది - Sakshi

కేసీఆర్ బయోపిక్ రెడీ అవుతోంది

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బయోపిక్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బయోపిక్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఎక్కువగా క్రీడాకారుల జీవిత కథలతో సినిమాలు తెరకెక్కుతున్నా అడపాదడపా ఇతర రంగాల వారి మీద కూడా బయోపిక్స్ తెరకెక్కిస్తున్న మేకర్స్. అదే బాటలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసిఆర్ జీవిత కథకు తెర రూపం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఈ సినిమాకు మధుర శ్రీధర్ దర్శకత్వం వహిస్తుండగా పెళ్లిచూపులు ఫేం రాజ్ కందుకూరి నిర్మిస్తున్నారు. తెలంగాణ కల సాకారమైన జూన్ 2న ఈ సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. 2018 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మధుర శ్రీధర్ వెల్లడించారు.

ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయం ఆసక్తిగా మారింది. విద్యార్థి నాయకుడిగా, మంత్రిగా, తెలంగాణ ఉద్యమ సారథిగా, ముఖ్యమంత్రిగా కేసిఆర్ జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను సినిమాలో ప్రస్థావించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement