యాక్షన్‌ సినిమాలో నటించాలనేది నా కొరిక

Tamannaah Said About Her New Film Action Its Been My Desire To Do High Action - Sakshi

యాక్షన్‌ సినిమాలలో నటించాలన్న తన చిరకాల కొరిక తమీళ ‘యాక్షన్‌’ మూవీతో తీరిందని టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ తమన్నా భాటియా అన్నారు. తమిళ స్టార్‌ హీరో విశాల్‌, తమన్నా తాజాగా నటించిన చిత్రం ‘యాక్షన్‌’. ఈ సినిమా ఇటివలె ఫ్రీ రిలీజ్ ఈవేంట్‌ను జరుపుకున్న విషయం తెలిసిందే.ఈ వారం విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమా గురించి తమన్నా మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజులుగా ఫుల్‌ లెన్త్‌ యాక్షన్‌ మూవీలో నటించాలని చుస్తున్నానని, అవకాశం కోసం ఎదురు చుస్తున్న తరుణంలో తన మేనేజర్‌ ఈ సినిమా గురించి చెప్పడంతో వెంటనే ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పేశానని తెలిపింది. ‘యాక్షన్‌’ మూవీలో  అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ సీన్‌లు ఉన్నాయని చెప్పింది. దీంతో పూర్తి నిడివి గల యాక్షన్‌ సినిమాల్లో నటించాలన్న తన కొరిక ఈ సినిమాతో నెరవెరిందని తమన్నా చెప్పుకోచ్చారు. 

కాగా ఈ సినిమా విశేషాల గురించి తమన్నా మాట్లాడుతూ.. హీరో విశాల్, తాను బాడి డబుల్స్‌తో స్టంట్స్‌ సీన్స్‌ చేశామని, రోప్‌పై చేసే యాక్షన్‌ సీన్‌లో తాను చాలా సేపు గడిపానని తమన్నా భాటియా పేర్కొన్నారు. అలాగే విశాల్‌తో కలిసి చాలా యాక్షన్‌ సీన్‌లలో నటించానని, ఈ అనుభూతి నాకు ఎంతో అనందాన్నిచ్చిందని ఆమె అన్నారు.

 సుమారు రూ. 65 కోట్ల బడ్జెట్‌తో ‘ట్రైడెంట్‌ ఆర్ట్స్‌’ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి ఐశ్వర్య లక్ష్మీ, విలక్షన నటుడు జగతిబాబులు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. కాగా సుందర్‌.సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్‌ చాలా ఉన్నాయి. సినిమాలో కొన్ని ముఖ్యమైన యాక్షన్‌ సీన్‌లను టర్కిలో చిత్రీకరించారు. అయితే హీరో విశాల్‌ భారీ యాక్షన్‌ సీన్‌లో తానే స్వయంగా నటించి గాయాలపాలైన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top