వదంతులను నమ్మొద్దు

Sussanne Khan visits Sonali Bendre in US and shares emotional post - Sakshi

అభిమాన తార గురించి ఏ వార్త అయితే వినకూడదని అభిమానులు కోరుకుంటారే సోనాలి బింద్రే గురించి శనివారం అలాంటిదే విన్నారు. ‘సోనాలి ఇక లేరు’ అనే ఆ వార్త విని షాక్‌ అయ్యారు. ఈ ఏడాది జూలై 4న కేన్సర్‌ సోకిన విషయాన్ని ప్రకటించిన సోనాలి చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఆమె ఆరోగ్యం గురించి సోనాలి భర్త గోల్డీ బెహల్‌ ట్వీటర్‌ ద్వారా వెల్లడిస్తున్నారు. సోనాలి కూడా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండి, తన గురించి చెబుతున్నారు. ‘ఏం ఫర్వాలేదు. చికిత్స సజావుగా సాగుతోంది.

సోనాలి సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి వచ్చేస్తారు’ అని అందరూ నమ్మిన సమయంలో ఓ ఎమ్మెల్యే ‘ఆమె ఇక లేరు’ అని చేసిన ట్వీట్‌ కలవరపరచింది. అయితే గోల్డీ బెహల్‌ అలాంటిదేమీ లేదని స్పష్టం చేయడంతో రిలీఫ్‌ అయ్యారు. ‘‘సోషల్‌ మీడియాని బాధ్యతాయుతంగా ఉపయోగించాలని విన్నవించుకుంటున్నాను. వదంతులను నమ్మొద్దు. ప్రచారం చేయొద్దు. ఒకవేళ చేస్తే సంబంధిత వ్యక్తులను బాధపెట్టినవారు అవుతారు’’ అని గోల్డీ బెహల్‌ ట్వీట్‌ చేశారు.

కాగా, సోనాలి తాను చదువుతున్న పుస్తకాన్ని పట్టుకుని దిగిన ఫొటోను రీసెంట్‌గా ట్వీటర్‌లో షేర్‌ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో అదే. సోనాలీకి బుక్స్‌ చదవడం అంటే ఆసక్తి. స్వయంగా ఆమె తన లైఫ్‌ జర్నీ గురించి ‘ది మోడ్రన్‌ గురుకుల్‌’ పేరుతో ఓ పుస్తకం రాశారు కూడా. ఇప్పుడు ఆమె రష్యన్‌ రచయిత అమోర్‌ తౌలీస్‌ రాసిన ‘ఎ జెంటిల్‌మెన్‌ ఇన్‌ మాస్కో’ బుక్‌ చదువుతున్నారు. ఈ నెల 6న ‘బుక్‌ రీడింగ్‌ డే’. స్వతహాగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్న సోనాలి ఆ రోజున ఈ బుక్‌ని సెలెక్ట్‌ చేసుకుని, చదవడం మొదలుపెట్టారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top