‘అత్తారింటికి దారేది’ రీమేక్‌లో హీరో ఎవరంటే..?

Sundar C And Simbu To Team Up For Attarintiki Daredi Remake - Sakshi

తెలుగులో ఘనవిజయం సాధించిన అత్తారింటికి దారేది సినిమాను కోలీవుడ్ లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరిగరాసింది. తాజాగా ఈ సినిమాను తమిళ రీమేక్‌ హక్కులను కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సొంతం చేసుకుంది.

అత్తారింటికి దారేది తమిళ రీమేక్‌లో శింబు హీరోగా నటించనున్నాడట. ఈ సినిమాను సీనియర్‌ దర్శకుడు సుందర్‌.సి డైరెక్ట్‌ చేయనున్నాడు. అంతేకాదు తెలుగులో నదియ కనిపించిన అత్త పాత్రను కోలీవుడ్‌లో సుందర్ సతీమణి, ప్రముఖ నటి కుష్బూ పోషించనున్నారు. ఇప్పటికే కన్నడలో రీమేక్‌ అయిన ఈ సినిమా కోలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top